ఒంగోలులో ఈవీఎంల గోదాంల తనిఖీ

ప్రకాశం జిల్లా ఒంగోలులోని మామిడిపాలెంలో భద్రపరిచిన ఈవీఎంల గోదాములను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో గోదాముల సీల్స్ను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్