రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంటలో ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పిస్తే ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకం అందిస్తుందని మార్కాపురం MVI మాధవరావు తెలిపారు. చాలామంది ప్రమాదాలను చూసికూడా కేసవుతుందని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారన్నారు. వాటిని కట్టడిచేసి, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకే రూ.5వేల ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. ఇదివరకులా కాపాడినవారిపై కేసులు ఉండవని ధైర్యంగా ముందుకొచ్చి కాపాడాలన్నారు.