ఒంగోలు కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సోమవారం మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రూ. 1.20 కోట్లతో జరుగుతున్న పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, కోర్ట్ ప్రాంగణంలోని క్యాంటీన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ కార్యాలయాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో, అవినీతి లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.