నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒంగోలులో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు డీఎస్పీ శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన డీఎస్పీ మైనర్లు వాహనాలు నడపడాని గుర్తించారు. మైనర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాహన యజమానులను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. యజమానులకు జరిమానా విధించడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చామని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.