ఒంగోలు: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి డీఎస్పీ శ్రీనివాసరావు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నిరంతరం రౌడీషీటర్ల పై పోలీసుల నిగా ఉంటుందని నేర ప్రవృత్తిని వీడి సప్రవర్తనతో ప్రజలతో కలిసి ఉండాలని వారికి సూచించారు. సమాజంలో మీ పిల్లలకు మంచి గౌరవం లభించాలంటే పద్ధతి మార్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్