ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాల కారణంగా కలెక్టర్ ఈనెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆమె సెలవు పై వెళ్లారు. కలెక్టర్ తమిమ్ అన్సారియా స్థానంలో ఇన్ చార్జ్ కలెక్టర్ గా గోపాలకృష్ణ బాధ్యతలను నిర్వహించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ తమిమ్ అన్సారియా మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు.