ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు. గాంధీపార్కు పక్కన టవర్లైన్ నిర్మాణం కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంటకాలనీ, గాంధీపార్కు మొయిన్ గేటు, మాంటి స్సోరి స్కూలు, కొండయ్య బొంకు, సాయిబాబా టెంపుల్, గాయిత్రీ మందిరం, బెతూన్ నర్సింగ్హాం, విన్నకోట వారి వీధి, ఖద్దర్ ఆఫీస్ రోడ్డు, శిద్దారాఘవ రావు బజారు, ఉమామహేశ్వరి కాలేజీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.