పోలీస్ డైరీని ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం, పోలీస్ విధుల నిర్వహణకు సంబంధించిన డైరీని ఎస్పీ ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తయారుచేసిన ఈ డైరీ, పోలీస్ సంక్షేమ సమాచార దీపికను ఎస్పీ సిబ్బందికి అందజేశారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమయ్యే అన్ని రకాల సమాచారాన్ని ఈ డైరీలో పొందుపరచడంపై ఎస్పీ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్