రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు, వెనుక కూర్చునేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలు, ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి వివరాలను పోలీసులు తెలియజేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్