ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం అద్దంకి, ఒంగోలు ప్రాంతాలలోని వీఎస్ఆర్ పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లోని నిల్వల గురించి నిర్వాహకులు, సిబ్బందితో మాట్లాడి, డీజిల్, పెట్రోల్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇంధన కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు.