ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ఒంగోలు, చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే పెట్రోల్ బంకుల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.