ప్రకాశం జిల్లాలో ఆదివారం సెలవు కారణంగా ఇంధన కంపెనీలు సరఫరా చేయకపోవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొందరు ముందస్తుగా అధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో అక్కడక్కడ కొరత ఏర్పడిందని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. ఈరోజు రాత్రికి అన్నీచోట్ల ఆయిల్ ఫిల్ చేస్తారని, రేపు యధావిధిగా వాహనదారులకు ఆయిల్ అందుబాటులోకి వస్తుందన్నారు. బంకుల వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు.