జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఎస్పీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జిల్లాలోని జాతీయ రహదారులపై 34 రోడ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.