ఒంగోలులో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ సస్పెండ్

ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోని దిబ్బల రోడ్డు సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న భీమవరపు సాయి కుమార్ను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో దుర్వినియోగం, ఇతర అభియోగాలపై బుధవారం కమిషనర్ టి. వెంకట కృష్ణయ్య విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో ఈ చర్య తీసుకున్నట్లు కమిషనర్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్