ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని గురువారం డిప్యూటీ కలెక్టర్ కళావతి పరిశీలించారు. గతంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు విన్నత్ పత్రాన్ని సమర్పించారు. విచారణ అధికారిగా కళావతిని జాయింట్ కలెక్టర్ నియమించడంతో ఆమె ఆక్రమణలపై విచారణ చేపట్టి నివేదికను జాయింట్ కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు.