ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బుధవారం మూడోరోజు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు గ్రానైట్ కంపెనీలపై తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి గ్రానైట్ తవ్వకాలు, తరలింపు జరుగుతోందా అనే కోణంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.