చీమకుర్తిలో సాధారణ స్థితికి పెట్రోల్ బంకులు

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఇంధన బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. ఇంధన నిల్వలు తగినంతగా ఉండటంతో రద్దీ తగ్గినట్లు పెట్రోల్ బంకు సిబ్బంది తెలిపారు. నేటి నుంచి 100% బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల నేపథ్యంలో సరఫరా యధావిధిగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్