ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభ్యున్నతిపై బుధవారం మెడికల్ ఆఫీసర్ బి. సుధామణి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న భవన స్లాబుల మరమ్మతులకు సంబంధించి తక్షణమే అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్రం మెరుగుదల కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్