ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎంఈవో-1గా షేక్ కాలేషా వలి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.