ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం దోర్నాల మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించి, నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు, ప్రజలకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.