సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట: ఏపీ డీజీపీ

విజయవాడలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో 2025 మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. "ఇప్పటికే 25 వేలకుపైగా సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా దేశంలోనే తొలిసారి ఏపీలో ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ వ్యవస్థను వినియోగిస్తున్నాం.ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ కోసం విజయవాడ పోలీసులు ‘ఏఐ వజ్రాస్త్రం’ పేరిట ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నారు’’ అని డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్