గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్!

AP: గ్రామ సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల బృందంతో భేటీ అయ్యారు. గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులపై చర్చించారు. వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మార్చి నాటికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్