AP: విజయవాడ పోలీస్ కమిషనర్ విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వసతి పొందుతున్న ప్రతి విదేశీ పౌరుడి వివరాలను 24 గంటల్లోగా indianfrro.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. సీ-ఫార్మ్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యాలపై రూ.50 వేల నుండి రూ.1 లక్ష వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.