AP: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉండవల్లి క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. విశాఖలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.