తిరుపతి రహదారులపై గుంతల నివారణకు మెటాలైట్ సంస్థ తయారు చేసిన ‘రోడ్ డాక్టర్’ వాహనాన్ని నగరపాలక సంస్థ రూ.1.40 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ వాహనం దిల్లీ నుంచి బుధవారం తిరుపతికి చేరింది. రోడ్లపై ఏర్పడే గుంతలను వేగంగా పూడ్చేందుకు అవసరమైన యంత్రాలు, తారు కరిగించే పరికరాలు దీనిలో ఉంటాయి. గురువారం కమిషనర్ మౌర్య సమక్షంలో దీని పనితీరు ప్రదర్శన తర్వాత అధికారికంగా వాహనం స్వీకరిస్తారు.