AP: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నలుగురు వ్యక్తులు తమను వేధిస్తున్నారంటూ 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాధ్యులను సస్పెండ్ చేయడంతోపాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.