ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలను తగ్గిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'రైతుబజార్ ప్రత్యేక కౌంటర్లలో కందిపప్పు కేజీ రూ. 150, బియ్యం కేజీ రూ.47, స్టీమ్డ్ బియ్యం కేజీ రూ.48కి తగ్గించాం. రేపటి నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించాం. నెల వ్యవధిలోనే రెండు సార్లు ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం' అని మంత్రి ట్విట్టర్‌లో తెలిపారు.