ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం రెన్యువల్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 3,619 మంది లెక్చరర్లు ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు (11 నెలలు) కొనసాగుతారని పేర్కొంది.