‌ఏపీలో జడ్జిల రిటైర్‌మెంట్ వయసు పెంపు

AP: ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయాధికారుల (జడ్జిలు/జుడీషియల్ ఆఫీసర్లు/మేజిస్ట్రేట్లు) పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గెజిట్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు. గతంలో 2024 నవంబర్లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల పలు రాష్ట్రాలకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕