ఆంధ్రప్రదేశ్‌లో 21 లక్షల BC ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. అలాగే 7.48 లక్షల SC, ST ఇళ్లలో 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెట్లను అమర్చాలని ఆదేశించారు. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపులకు సోలార్ సిస్టమ్‌లు, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చి నాటికి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.