హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం

AP: హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.లక్ష అందించనున్నట్లు వెల్లడించింది. అయితే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లే వారికే ఈ సాయం అందుతుందని పేర్కొంది. ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్లేవారికి రూ.లక్ష అందజేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్