AP: రాష్ట్రంలో గ్రామీణ రోడ్లు, వంతెనల నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,085 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను 4 క్వార్టర్లకు ఒకేసారి కేటాయించారు. వివిధ పథకాల కింద చేపట్టాల్సిన పనుల వివరాలను జీవోలకు జత చేశారు. విభాగాధిపతులు ప్రణాళిక ప్రకారం ప్రతినెల సమీక్షించి నిధులను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.