అనకాపల్లి మృతుల కుటుంబాలకు రూ.15లక్షల పరిహారం

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే హోం మంత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు సూచన మేరకు రూ.15 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్