ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉపాధి కూలీలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఉపాధి హామీ కూలీల బకాయిల చెల్లింపుల కోసం కేంద్రం రూ.180 కోట్లు విడుదల చేయనుంది. 2014–2019 మధ్య జరిగిన 3.5 లక్షల ఉపాధి పనుల బిల్లులు చెల్లించేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. వైసీపీ హయాంలో ఆగిపోయిన చెల్లింపులపై కూటమి ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నిధులు మంజూరయ్యాయి.