AP: అమరావతికి కృష్ణా నది వరద ముప్పును తగ్గించేలా కరకట్ట పటిష్టీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.443.26 కోట్ల సవరించిన అంచనాలకు అనుమతి లభించింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ఆధ్వర్యంలో పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర ఉన్న కరకట్టను మరింత బలోపేతం చేయనున్నారు. భారీ వరదలు, ఇసుక రవాణా కారణంగా కరకట్టకు ఏర్పడే ముప్పును తగ్గించడంతోపాటు రాజధాని ప్రాంతాన్ని వరదల నుంచి రక్షించడమే పనుల ప్రధాన ఉద్దేశం. సూచించారు.