సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో సమ్మెకు రంగం సిద్ధమైంది. అద్దె బస్సు యజమానులు నిర్వహణ ఖర్చులు పెరిగాయని, బస్సుల అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత పథకం అమలుతో తమ ఖర్చులు పెరిగాయని, నెలకు అదనంగా రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ సమ్మె జరిగితే పండుగ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.