దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 109వ స్కాచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఎన్జీఆర్ఏయూ) ఆహార భద్రతలో విశిష్ట సేవలకు గాను స్కాచ్ గోల్డ్ అవార్డును అందుకుంది. స్కాచ్ సమ్మిట్లో ఏఎన్జీఆర్ఏయూకు జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఈ అవార్డు విశ్వవిద్యాలయం యొక్క కృషికి గుర్తింపుగా నిలిచింది.