AP: PHC స్థాయిలోనే నిర్ధారణ పరీక్షల నమూనాలను సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు నమోదయ్యాయి. 9 మరణాలు అనుమానిత కేసులని, లోతైన పరీక్షల కోసం జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. PHC స్థాయిలోనే నిర్ధారణ పరీక్షల నమూనాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.