స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఎస్ఈసీ సమీక్ష

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర నేడు (గురువారం) కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు, శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్లు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్