రేషన్ కార్డుదారులకు షాక్.. ఈ సారి కూడా కందిపప్పు లేనట్లే!

AP: రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా షాక్ తప్పలేదు. ఈసారి కూడా రేషన్‌లో కందిపప్పు అందుబాటులోకి రాలేదు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ మొదలైంది. ఈ నెల కూడా బియ్యం, చక్కెర పంపిణీ చేస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రమే గోధుమ పిండి, రాగులు, జొన్నలు పంపిణీ జరుగుతోంది. అయితే, మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులకు భారంగా మారింది. అందుకే రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీ చేస్తే బాగుంటుందని లబ్ధిదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్