ఏపీలో SIRలో భాగంగా నోటీసులు అందుకున్న 44,24,411 మంది ఓటర్ల విచారణను ఎన్నికల సంఘం దాదాపు పూర్తి చేసింది. వీరిలో 42,01,092 మందిని అర్హులుగా, 1,66,279 మందిని అనర్హులుగా గుర్తించింది. మరో 57,040 మంది ఆధారాల పరిశీలనలో ఉండగా.. 4,434 మంది విచారణ పెండింగ్లో ఉంది. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6లో 85,736, ఓటరు వివరాల మార్పులకు ఫారం-8లో 40,991 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.