కందుకూరులో రేపు పవర్ కట్

నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కందుకూరు పట్టణం మొత్తం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్