రేపు కావలి గ్రామీణ పరిధిలో పవర్ కట్

కావలి మండలం గ్రామీణ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కావలి రూరల్ ఏఈ చేజర్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు. 33 కెవి సబ్ స్టేషన్స్ లలో మరమత్తులు, విద్యుత్ లైన్ల వద్ద అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపు వంటి చర్యలు చేపడుతున్న కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.

సంబంధిత పోస్ట్