శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలంలో జరుగుతున్న ఓటర్ల సర్వే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఓటర్ల వివరాలను కచ్చితంగా నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చాలని సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఫజిహా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ షేక్ సుభాని పాల్గొన్నారు. ఎన్నికల ఆర్ఓ వెంకటరెడ్డి సర్వే ప్రక్రియ వేగవంతంగా జరగాలని అన్నారు.