ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల ఎస్సైగా ఏ ఇశాక్ భాషా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జూదము, పేకాట, ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝులిపిస్తామని ఎస్సై ఇషాక్ బాషా హెచ్చరించారు.