గుత్తిలో తల్లిపాల వారోత్సవాలపై అవగాహన

గుత్తి ఆర్ ఎస్ లోని సుందరయ్య కాలనీలో తల్లిపాలు వారోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలు చాలా శ్రేష్ఠమైనవని, వీటిలో అనేక పోషకాలు ఉండటంతో శిశువు ఆరోగ్యంగా పెరుగుతారని తెలిపారు. ప్రతి తల్లి చనుపాలు తాపించాలని, డబ్బాపాలను ఉపయోగించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పార్వతి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్