గుత్తి: ఆస్తి పన్ను చెల్లించండి

ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా సూచించారు. గుత్తి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీ పరిధిలో రూ. మూడు కోట్లు ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిలు ఉన్నాయన్నారు. పెద్ద హోటళ్లు, లాడ్జిలు, దుకాణాలు నిర్వాహకులు అధికంగా ఆస్తి పన్ను బకాయి పడ్డారన్నారు. ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి నోటీసులు పంపుతామన్నారు.

సంబంధిత పోస్ట్