న్యాయం చేయాలని తహశీల్దార్‌కు వేడుకోలు

గోరంట్ల మండలం పెద్దినేపల్లికి చెందిన మాల క్రిష్టప్ప కుటుంబం తమ భూమి వివాదంలో న్యాయం చేయాలని తహశీల్దార్‌ను కోరింది. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కోర్టులు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా పాసుపుస్తకాలు జారీ కాలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల కోసం ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని, అధికారులు చొరవ తీసుకుని తమకు పాసుపుస్తకాలు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్