రొళ్ళ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం, ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు అధ్యక్షులు, ఇద్దరు ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు జారీ చేయనున్నట్లు తహసీల్దార్ షేక్షవలి తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, అందరూ సహకరించాలని ఆయన సూచించారు.