గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ గురువారం రాత్రి జమ్ముకశ్మీర్ లో వీరమరణం పొందారు. శనివారం వీర జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం స్వగ్రామంకు చేరనుంది. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. గోరంట్ల మండలం కళ్లితండా గ్రామంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు రానుండటంతో పుట్టపర్తి ఆర్టీవో సువర్ణ స్వయంగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.